1 August, 2026 | 2:21 AM

నగరంలో తెలుగు పేజెంట్ యూకే విజేతల సందడి

01-08-2026 12:33 AM

జూబ్లీహిల్స్, జూలై 31 (విజయక్రాంతి): దేశీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఇటీవల తెలుగు పేజెంట్ యూకే - 2026 పోటీలను నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో సం స్థ వ్యవస్థాపకురాలు ప్రీతి పులిపాక ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. అందులో గె లుపొందిన విజేతలు నగరంలో సందడి చేశారు.

జూబ్లీహిల్స్ లోని గ్రీజ్ మంకీ రెస్టారెంట్ లో ముఖాముఖిని నిర్వహించారు. ఈ పోటీల్లో కిడ్స్, టీన్స్, మిస్, మిసెస్ విభాగాల విజేతలుగా నిలిచిన ఈతన్ యండ్రపాటి, షానయ పల్లెర్ల, క్రిస్సీ యండ్రపాటి, శ్లోక కర్ర, సంజనా పప్పు, సౌజన్య మిరుద్దోడి పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, తెలుగువారి ప్రతిభ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను ప్రోత్సహించే లక్ష్యంతో పోటీలను నిర్వహించారన్నారు.

అంతర్జాతీయ వేదికపై తెలుగు సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రీతి పులిపాక మాట్లాడుతూ ఈ పోటీల వేదిక గా త్వరలో రానున్న ఎపిక్ తెలుగు సినిమా ప్రచారాన్ని నిర్వహించి భారత్‌యూకేల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేశామని తెలిపారు. కేక్ కటింగ్ కార్య క్రమంలో పుష్ప ఫేమ్ నటుడు జగదీష్, దర్శకుడు తరుణ్ హాజరయ్యారు.