యూరియా పాట్లు
- యాప్ తెచ్చిన రైతులకు తప్పని ఇబ్బందులు
- యాప్‌లో నమోదు చేసుకున్న యూరియా కరువు
- యూరియాను గల్లంతు చేస్తున్న అక్రమార్కులు
- కామారెడ్డి జిల్లాలో యూరియా కోసం రైతుల ఇక్కట్లు
కామారెడ్డి, జూన్ 30 (విజయక్రాంతి): యూరియా ఇక్కట్లు రైతులకు తప్పడం లేదు. అసలే వర్షాలు పూర్తిస్థాయిలో పడకముందే పంటల కోసం రైతులు యూరియా కోసం ఎగబడుతున్నారు. అసలు సమయంలో ఉంటుందో ఉండదో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం యూరియా మిస్ యూస్ కావద్దని ఉద్దేశంతో ఈ సీజన్లో యాప్ లో నమోదు చేసుకున్న వారికి యూరియా అందిస్తామని పేర్కొనడంతో అవగాహన లేని రైతులు ఆందోళన చెందుతూ ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి లో సింగిల్ విండోలో యాప్ ద్వారా రైతులు యూరియా కోసం నమోదు చేసుకున్నారు. మంగళవారం యూరియా తెచ్చుకునేందుకు విండో కార్యాలయానికి వెళ్ళగా అక్కడ యూరియా సంచులు లేవు.
చేతివాటం ప్రదర్శిస్తున్న అధికారులు
తాము యూరియా కోసం యాప్ లో నమోదు చేసుకున్న యూరియా ఎక్కడ గల్లంతయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించి యూరియాను గల్లంతు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తమకు ఇవ్వాల్సిన యూరియా సంచులు ఇతరులకు ఇచ్చి తమకు కొరత సృష్టించారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విండోలో పనిచేసే సిబ్బంది చేతి వాటం వల్లే తమకు ఇవ్వాల్సిన యూరియా గల్లంతు చేశారని రైతులు ఆరోపించారు. సొసైటీ ఎదుట రైతులు నిరసన వ్యక్తం చేశారు. యూరియా గల్లంతు చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
యాప్‌లో నమోదు చేసుకున్న అందని యూరియా
ఉదయం 6 గంటలకే యూరియాను యాప్ ద్వారా నమోదు చేసుకొని సింగిల్ విండో కార్యాలయానికి వస్తే యూరియా లేదని అధికారులు చెప్పారని రైతులు పేర్కొన్నారు. ఒకవైపు అధికారులు రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తుంటే స్థానిక అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులకు యూరియా అందడం లేదు.
అక్రమాలకు పాల్పడే పై వారిపై చర్యలు తీసుకోవాలి
అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారుతుంది. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే తప్ప యూరియా కష్టాలు రైతులకు తప్పేటట్లు లేవు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






