21 April, 2026 | 4:41 PM

Breaking News

డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •   భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   మంత్రి ఉత్తమ్ కేసీఆర్ కోవర్ట్: ఎంపీ అర్వింద్   •   ఘనంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం   •  

కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం

29-11-2025 08:44 PM

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. 

ఎల్బీనగర్: కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. శనివారం దీక్షా దివస్ సందర్భంగా గడ్డిఅన్నారం డివిజన్ వీవీనగర్ బస్ స్టాప్, హయత్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రక్తదాన శిబిరం, మెగా హెల్త్ క్యాంపు, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో తిరుగుబాటు జ్వాల పుట్టిన రోజు 2009 నవంబర్ 29 అన్నారు. ఆనాడు కేసీఆర్ ఇచ్చిన పిలుపు కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో... అనే మాట తెలంగాణ ప్రజలను కదిలించిందన్నారు. దీక్షా దివస్ మన గౌరవం, మన గర్వం అని పేర్కొన్నారు.

అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు భవాని ప్రవీణ్ కుమార్, సామ తిరుమల రెడ్డి, రమేష్ ముదిరాజ్, బీఆర్ఎస్ డివిజన్ల అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, చెన్నగొని శ్రీధర్ గౌడ్, మల్లీశ్వరి రెడ్డి, భాస్కర్ సాగర్, శ్రావణ్, అంజలి, రమణారెడ్డి, రాము, యాద శంకర్, స్కైలాబ్, ప్రదీప్, రాకేశ్, పారంద రమేశ్, సత్తిరెడ్డి, శ్రీకాంత్, రాధిక, లక్ష్మణ్, ఇంద్రకరణ్, విక్కీ, విజయ, మధు, వర్షిత్, వాణి, నాగమణి, లక్ష్మీ, నగేశ్, దేవరం నాయక్, శంకర్ నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.