21 April, 2026 | 5:38 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

భిక్కనూరులో 77 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

21-04-2026 04:10 PM

ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చేతుల మీదుగా అందజేత

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 77 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తోందన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు చెక్కులు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం తమ కుటుంబాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సునీత, ఎంపీడీవో కిరణ్ కుమార్ రెడ్డి, పశువైద్యాధికారి దేవేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పరి రమేష్, భిక్కనూర్ సర్పంచ్ బాల్యాల రేఖ,ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి,భాగిర్తిపల్లి సర్పంచ్ నర్సింలు,ఉప సర్పంచ్ స్వామి, లక్ష్మీదేవిపల్లి గ్రామ సర్పంచ్ జె. లింగారెడ్డి, అంతంపల్లి ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మండల జనరల్ సెక్రటరీ తిరుమలేష్, పొన్నాల రంజిత్, ఉపాధ్యక్షులు నరేందర్, నర్సింహులు, సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.