21 April, 2026 | 5:36 PM

కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు

21-04-2026 04:20 PM

కాంగ్రెస్ నాయకులకు దీటుగా కౌంటర్ ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంట తండాను నూతన జిపిగా కేసీఆర్ ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాధుడే లేకుండే అని బిఆర్ఎస్ నాయకులు అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో కోట్ల రూపాయలతో తండా అభివృద్ధి జరిగింది. మహా దేవునిగడ్డ తండాకు, తాడిచెట్టు గడ్డ తండాలకు కోట్ల రూపాయలతో బిటి రోడ్ల నిర్మాణం,ప్రతి తండాకు లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్ల నిర్మాణం, నాలుగు అంగన్వాడి కేంద్రాల నిర్మాణం,గ్రామపంచాయతీ బిల్డింగ్, త్రాగునీటి కొరకు బోరుబావుల తవ్వకం ఇలా చెప్పుకుంటూ పోతే కోట్ల రూపాయలు వేచించి తండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.

రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామంలో కేవలం 15 లక్షల,,రూపాయల సిసి రోడ్ వేసి అదేదో పెద్ద అభివృద్ధి అన్నట్టు చెప్తున్నారు. అది సర్పంచ్ ఎన్నికలు జరగకముందే  కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి. తండాలను పట్టించుకునే నాధుడేలేని సమయంలో తాండాలను అభివృద్ధి చేసిన ఘనత కేసిఆర్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే సురేందర్దే అన్నారు. మెల్లకుంట తండా మాజీ సర్పంచ్ కేస్లీలీ వాసు రామ్ నువ్వే కదా మాజీ ఎమ్మెల్యే సురేందర్  ఆధ్వర్యంలో లక్షల రూపాయలు సిసి రోడ్లు నిర్మాణం చేపట్టింది. నువ్వే కదా గుండె మీద చేయి వేసుకొని చెప్పు.తల్లి పాలు తాగి తల్లి గుండెల మీద తన్నే మాటలు మాట్లాడుతున్నావు. గ్రామపంచాయతీ నిర్మాణానికి స్థలం విరాళంగా ఇచ్చానంటున్నావు. నీకు గ్రామపంచాయతీ శాంక్షన్ ఇచ్చింది.

ఎవరు మాజీ ఎమ్మెల్యే సురేందర్ కాదా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి పచ్చఅబద్ధాలు మాట్లాడుతున్నావు.ఎవడికయ్యా తండాలో 100% రుణమాఫీ అయిందని చెప్తున్నావ్, తండాలో తెలుసుకో తెలుస్తది కేవలం 60% మాత్రమే రుణమాఫీ జరిగింది.మీ రేవంత్ రెడ్డి అంటుండు కదా తెల్లమొఖం వేసుకొని అయింది కావచ్చు. ఇచ్చినం కావచ్చు అని,పదేళ్ల పాలనలో కెసిఆర్ రేషన్ కార్డు ఇవ్వలేదా ఒకసారి మీఇంట్లో ఉన్న రేషన్ కార్డును తీసుకొని చూసుకో తెలుస్తది. అప్పుడైతే గాని నీకు అర్థం అవుతది కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత  కేసీఆర్ ది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మదన్మోహన్ పుణ్యంతో బియ్యం తీసుకుంటున్నామంటున్నావు.వీళ్లు రాజకీయాలు మొదలు పెట్టకముందు నుండే కంట్రోల్ బియ్యమని పథకం ఉండేది.

అది పేద ప్రజలకు ఫ్రీగా అందించాలని కేసీఆర్  ఫుడ్ సెక్యూరిటీ కార్డులను అందించారు.త్రాగునీటి కోసం మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి తండాకు వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రతి ఇంటికి నల్లనీటి అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ది నువ్వే అంటున్నావ్ కదా నేను తండాకు అభివృద్ధి చేసినా అని,ఈరోజు వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యార్డ్, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్ ట్రైలర్ ఇచ్చిన ఘనత కెసిఆర్ ది నువ్వే కదా నాకు డబ్బులు సరిపోలేదని ట్రాక్టర్ ఈఎంఐ కోసం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వద్ద లక్షల రూపాయలు తెచ్చుకున్నది నువ్వు కాదా ఎందుకయ్యా అన్ని పచ్చ అబద్ధాలు మాట్లాడతావు. ఎందుకయ్యా నీకు అంత కడుపు మంట మేము ఏర్పాటు చేసుకున్న తండా ఆవిర్భావ దినోత్సవసభ సక్సెస్ కావడంతో భరించలేని నువ్వు పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నావ్ ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధిపై సమావేశం ఏర్పాటు చేసి చెప్పు చూద్దాం టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపిస్తాం.

ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అంటున్నాం.ఎవడికి ఇచ్చినావు పేదవాడికి ఇచ్చిన అంటున్నావు కదా తండాలో అడిగి చూడు ఎవరో పేదవారు తెలుస్తది.కేవలం నీబలగం పెంచుకోవడానికి నీఇంటివారికే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినావు,నిజంగానే నీకు తండపై ప్రేమ ఉంటే గుడిసెలు ఉన్నాయి కదా నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేదుంటివి కేవలం ఎమ్మెల్యే తొత్తులాగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే మిమ్మల్ని ఏడ తిడతాడో అని,తండాలో ఆవిర్భావ సభసక్సెస్ అయిందని భయంతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఊకదుంపుడు మాటలు మాట్లాడుతున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు ఊరుకోము. నీగుండె మీద చేయి వేసుకొని చెప్పు నీజీవితంలో సర్పంచ్ అయ్యేవాడివేన కేసీఆర్ గ్రామపంచాయతీ ఏర్పాటు చేయకపోతే, నీపక్కన కూర్చున్న అతను మాట్లాడుతున్నాడు.

నేను ఉపసర్పంచ్ పదవికి రాజీనామా చేస్తున్నానని గ్రామపంచాయతీ ఏర్పడకపోతే నువ్వు వార్డ్ మెంబర్ అయ్యేవాడివా నీకు అంత సీన్ ఉండేదా.అది గుర్తుపెట్టుకుని మెదలాలి నువ్వు మాజీ ఎమ్మెల్యేను మాజీ ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయానిది నోరు ఉందని ఏదైతే అది అబద్ధాలు మాట్లాడేసి ఎదుటివారిని భయపెడుదాం అనుకుంటే ఎవరు ఊరుకునేవారు లేరు. ఇక్కడ మేము అభివృద్ధి చేసినం చేసిందే మాజీ ఎమ్మెల్యే సురేందర్ ప్రజలకు వివరించారు.సర్పంచ్ బాల్య నాయక్ను పార్టీలో కలువమని నువ్వు అడగకపోతే నీకెందుకయ్యా అంతనొప్పి అడిగినావు కాబట్టే దోసకాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకుంటున్నావ్ అర్థమవుతుంది.ప్రజలకు మీరు ఎలాంటివారు ఏఎండకు,ఆగొడుగు పట్టుకుని అవసరం తీరాక నోటికొచ్చినట్లు మాట్లాడతారని అర్థమవుతుంది.