30 May, 2026 | 9:44 PM

ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం

30-05-2026 09:11 PM

మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపిన ఆలపాటి

దమ్మపేట,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్, ఆయిల్ ఫామ్ అమలలో తెలంగాణ రాష్ట్రం దేశములోనే నెంబర్ వన్ గా నిలిచిందని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కు తెలంగాణా రాష్ట్ర ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ కృతఙ్ఞతలు తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపిందని, 2021 నుండి 2026 వరకు దేశంలో పామ్ ఆయిల్ సాగు విస్తీర్ణాన్ని కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేయగా దాంట్లో తెలంగాణ రాష్ట్రంలోనే 40 శాతం పామాయిల్ విస్తీర్ణం సాగు చేస్తుందని, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారుగా 98,112 హెక్టార్ల లో పామ్ సాగు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని పామాయిల్ హబ్ గా నిలిపి,  విస్తీర్ణం లో నెంబర్ వన్ గా చేయాలనే సంకల్పంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం అందుకు తగిన విధంగా చర్యలు  చేపడుతున్న  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయ శాఖ అంటేనే కీలకమనీ, దాంట్లో స్వయంగా వ్యవసాయాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆ శాఖకు మంత్రిగా ఉండటం తెలంగాణా రైతుల అదృష్టమని అన్నారు. పామ్ రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆలపాటి మంత్రి తుమ్మల దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డా ప్రసాద్ వున్నారు.