ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడం సిగ్గుచేటు
28-07-2026 02:27 PM
ఉమ్మడి మెదక్ జిల్లా దళిత సంఘం నాయకులు తలారి దేవరాజ్
రేగోడు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల గడుస్తున్న ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఉమ్మడి మెదక్ జిల్లా దళిత సంఘం నాయకులు తలారి దేవరాజు అన్నారు. తెలంగాణలో ఉన్న మాల మాదిగలు అంటే ప్రభుత్వానికి ఎందుకు చిన్న చూపు అని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






