28 July, 2026 | 3:23 PM

కేస్లాపూర్ లో కార్డెన్ సెర్చ్

28-07-2026 02:22 PM

- ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యం 

- భీమిని ఎస్సై కోటేశ్వర్ 

భీమిని,(విజయక్రాంతి): ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని భీమిని ఎస్ఐ కోటేశ్వర్ అన్నారు. మంగళ వారం మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజల భద్రతే పోలీసుల లక్ష్యమని అన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉదయం  గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి 56 ద్విచక్ర వాహనాలు, ఆటో, టాటా  ఏస్, ట్రాక్టర్ ల లైసెన్స్ పత్రాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో మాదకద్రవ్యాలు, గుడుంబా, గాంజా వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండాలన్నారు. వీటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.