సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరి చేయడం జరిగిందని ఏఐసీసీ తెలంగాణ విచారి విభాగ్ కోఆర్డినేటర్ తుల అరుణ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ స్కూల్ మంజూరి కోసం రాజ్యసభ సభ్యుడు వేం. నరేందర్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు. పార్లమెంటు సభ్యులు జి నగేష్ స్థానిక శాసనసభ్యులు జాదవ్ అనిల్ మాజీ ఎంపీ సోయం బాపూరావు డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్లు వ్యూహాత్మకంగా మంజూరు కోసం సహకరించారన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మంజూరు కి తన వంతు సహకారం అందించిన ముఖ్యమంత్రి కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల మంజూరితో పేద విద్యార్థులకుఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నూతనంగా ఏర్పడిన మండలం అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.






