అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, సమాచార సాంకేతిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఐఈఈఈ ఎస్ఎస్ఐటి స్టూడెంట్ చాప్టర్ సహకారంతో "కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ అనే అంశంపై మూడు రోజుల వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 4 బి.టెక్. మొదటి సెమిస్టర్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్క్ షాప్ టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) హైదరాబాద్ కు చెందిన డి. భవాని, టెక్నికల్ ట్రైనర్, ముఖ్య వనరుల వ్యక్తిగా హాజరై అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ, సమస్య పరిష్కార నైపుణ్యాలు, టైమ్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూలలో విజయానికి అవసరమైన వ్యూహాలపై విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించారు.
ఈశిక్షణ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, క్యాంపస్ ప్లేస్మెంట్లకు సమర్థవంతంగా సిద్ధమయ్యేలా దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జి.ఎల్. ఆనంద్ బాబు స్టూడెంట్ చాప్టర్ ఫ్యాకల్టీ అడ్వైజర్ సమన్వయం చేయగా, ఐటీ విభాగాధిపతి డాక్టర్ నితీషా శర్మ విద్యార్థులు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని ప్లేస్మెంట్ అవకాశాలను మెరుగుపరచుకోవాలని సూచించారు.






