బీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ సాధన
మెదక్, ఏప్రిల్ 27(విజయ క్రాంతి) : బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్ర సాధనకు కీలక మలుపుగా నిలిచిందని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ జెండాను పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్, పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..తెలంగాణ కోసం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిన పోరాటానికి బిఆర్‌ఎస్ పార్టీ ఒక వేదికగా మారిందన్నారు. కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల వల్లే ఉద్యమం సాఫల్యం సాధించిందని తెలిపారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ గడ్డమీద కృష్ణ గౌడ్, లింగారెడ్డి, కౌన్సిలర్లు దీపక్ కుమార్, సోహెల్, మాజీ కౌన్సిలర్ లు మాయ. మల్లేశం, చంద్రకళ, విజయలక్ష్మి, ఆర్కే శ్రీనివాస్,నాయకులు ప్రభు రెడ్డి, ఏనుగుల రాజు, గట్టేష్, సాదిక్, ఇందాడ్, సాయ గౌడ్, ఇస్మాయిల్, సునీల్, సాయికుమార్, మహిళా నాయకురాలు రాధా, లత పాల్గొన్నారు.






