ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
ముషీరాబాద్, జూన్ 2(విజయక్రాంతి): ముషీరాబాద్ నియోజకవర్గం లో మంగళవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడు కలను వైభవంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని కవాడిగూడ, గాంధీ నగర్, భోలక్ పూర్ అడిక్మెట్, ముషీరాబాద్, రాంనగర్ డివిజన్ ల లో ఆయా పార్టీల నాయకులు తెలంగాణ జాతీయ జెండాను ఎగురవేసి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బాపూజీ నగర్ లో బీఆర్‌ఎస్ నేత సోమ సుందరం ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముషీరాబాద్ ఎమ్మెల్యే హాజరై తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి పోరాడి అసువులు బాసిన అమరవీరుల కు నివాళులర్పించారు. అమరుల త్యాగాలను మరువలేనివని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముఠా జైసింహ, దీన్ దయాల్ రెడ్డి, శివ ముదిరాజ్, వై. శ్రీనివాసరావు, వల్లాల శ్యా మ్ యాదవ్, శంకర్ ముదిరాజ్, శ్రీధర్ రెడ్డి, రాకేష్ కుమార్,తదితరులున్నారు.
బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్‌లో
సికింద్రాబాద్ జూన్ 2 (విజయ క్రాంతి)తెలంగాణ రాష్ట్ర 12 వ ఆవిర్భావ దినోత్సవా న్ని పురస్కరించుకుని,బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ వద్ద బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జ క్కుల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బోర్డ్ మా జీ సభ్యుడు పాండు యాదవ్,బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులతో కలిసి జక్కుల మహేశ్వర్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి,జాతీయ,బిఆర్‌ఎస్ జెండాల ను, ఆవిష్కరించి,తెలంగాణ అమరవీరులకు ఘ న నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎన్నో దశాబ్దాల ప్రజా పోరాటాల ఫలితమని, విద్యార్థులు, యువ త, ఉద్యోగులు, రైతులు, మహిళలు మరి యు వివిధ ప్రజా సంఘాలు చేసిన త్యాగా లు, ఉద్యమాలు,నిరాహార దీక్షలు, ఆందోళనల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యా గం చేసిన అమరవీరుల సేవలను ఎప్పటికీ మరువలేమని మహేశ్వర్ రెడ్డి అన్నారు.
అనంతరం పాండు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి జరగాలని, యువతకు ఉపాధి అవకాశాలు, రైతులకు భరోసా, మహిళలకు రక్షణ,అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా పాలన సాగాలని పాండు యాదవ్ ఆకాంక్షిస్తూ,బిఆర్ ఎస్ పా ర్టీ ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన, సామాజిక న్యాయం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్ పి లుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నాగోల్ డివిజన్‌లో..
నాగోల్, జూన్ 2 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్క రించుకుని నాగోల్ డివిజన్ పరిధిలోని జైపూరి కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఉద్యమ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. కా ర్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కో సం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యా గాలు చిరస్మరణీయమని కొనియాడారు. తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వ్యవసాయం, సాగునీరు, విద్యుత్, సంక్షేమం, మౌలిక సదుపాయాల రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింద ని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమ ని, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకుడు ఆనంతుల రాజిరెడ్డి, అధ్యక్షుడు తూర్పటి చిరం జీవి, రంగేశ్వరి, సతీష్ యాదవ్, సుధాకర్ చారి, పల్లె సీతారాములు, ఈశ్వరయ్య, ఉమ, లక్ష్మి, రేవంత్ గౌడ్, శివ, శ్యామ్ సుందర్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, శంకర్, నర్సింహా చారి తదితరులు పాల్గొన్నారు.
బోయిన్ పల్లిలో
సికింద్రాబాద్,జూన్2 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చొరవ తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు లు జంపన ప్రతాప్ అన్నారు. తెలంగాణ ఆ విర్భావ దినోత్సవం పురష్కరించుకొని న్యూ బోయినపల్లి ప్లే గ్రౌండ్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, బోర్డు ఆరవ వార్డు సీతారాంపురం కాలనిలో నిర్వహించిన వేడుకల్లో జంపన ప్రతాప్, పాండు యాదవ్ పాల్గొని జాతీయ పతాకం ఎగురవేశారు.
ఈ సందర్భంగా జంపన ప్రతాప్ మాట్లాడుతూ ఉద్య మ సమయంలో అప్పటి ఉద్యమ కారులు ప్రభుగుప్తా,సానం శశి, వీరారెడ్డి,సుకుమార్ విజ్ఞప్తి మేరకు బోయినపల్లి ప్లే గ్రౌండ్ వద్ద తొలి విగ్రహం ఏర్పాటు చేసినట్లు ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు కే.పాండు యాదవ్, సాయిబాబాయదవ్,దశరత్ యాదవ్, విజయరాజు, ప్ర కాష్, నాగభూషణం,వరప్రసాద్,నారాయ ణ, గోవర్ధన్,షకీబ్ హుస్సేన్, ప్రభుగుప్తా, చోటు,జంపన రవి,ముకేశ్ యాదవ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు..
ఓల్డ్ బోయిన్పల్లిలో..
సికింద్రాబాద్,జూన్2 (విజయ క్రాంతి): అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని ముద్దం నరసింహ యాదవ్ అన్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓల్డ్ బోయిన్పల్లి బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో వద్ద మాజీ కా ర్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు, మహి ళా నాయకురాలు కార్యకర్తలు తో కలిసి జాతీయ జెండా,బీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆ విష్కరించి,తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.
అనంతరం మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోట్లాది ప్రజల ఆకాంక్షలు,అమర వీరుల త్యాగాల ఫలితం గా ఏర్పడిందని ముద్దం అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్ నాయకత్వం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నర సింహ యాదవ్ అన్నారు.తెలంగాణ ఏర్పడిన తరువాత రైతులు, విద్యార్థులు, మహిళ లు,పేదల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని ముద్దం నరసింహ యాదవ్ తెలియజేశారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ పాలనను కోరుకుంటున్నారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ నాయకత్వం లో పార్టీ మరింత బలోపేతం అవుతోందని నరసింహ యాదవ్ తెలిపారు.తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవాన్ని కాపాడగల శక్తి బిఆర్‌ఎస్ కే ఉంది అని, రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సుల తో మ ళ్లీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడుతుందని నరసింహ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం ప్రా ణత్యాగం చేసిన అమరవీరులకు నివాళులర్పిస్తూ,వారి ఆశయాల సాధన కోసం బీఆర్ ఎస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని ముద్దం నర్సింహ యాదవ్ అన్నా రు. ఈ సందర్భంగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్య మకారులు,బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
సనత్‌నగర్‌లో
సనత్‌నగర్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా సనత్నగర్ డివిజన్లోని నెహ్రూ పా ర్క్ బీజేపీ చౌక్ వద్ద డివిజన్ అధ్యక్షులు సి. నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ ప తాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయ కులు, కార్యకర్తలు పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధ నలో అమరులైన వీరులకు నివాళులర్పించి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆక్స్ఫర్డ్ స్కూల్లో
ముషీరాబాద్, జూన్ 2(విజయక్రాంతి): 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్లో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. హిమాయత్నగర్లోని పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్కూల్ చీఫ్ పాటర్న్ మణికొండ వేదకుమార్ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్ర పట్ల గర్వంగా ఉం డాలని, తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర గొప్ప వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాముఖ్యత, రా ష్ట్రం సాధించిన ప్రగతి, వివిధ రంగాల్లో నమోదైన అభివృద్ధిపై విద్యార్థులకు వివరించారు. ఉపాధ్యాయులు ఆలపించిన తెలం గాణ జానపద, దేశభక్తి గీతాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కట్టా ప్రభాకర్, డీన్, ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.
మీర్ పేట్‌లో
జూన్ 2: (విజయ కాంతి) బడంగ్ పేట్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. మం గళవారం మహేశ్వరం ని యోజకవర్గం బడంగ్ పేట్ సర్కిల్ మీర్ పేట్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ మం త్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలంగాణ సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరులకు ఆమె ఘన నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎందరో అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అహర్నిశల కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించి, దేశానికి ఆదర్శంగా నిలి చిందన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ, అర్కల కామేష్ రెడ్డి, అర్కల భూపాల్ రెడ్డి, దీప్ లాల్ చౌహాన్, సిద్దాల పెద్ద బీరప్ప, ఏనుగుల అనిల్ కుమా ర్ యాదవ్, దిండు భూపేష్ గౌడ్, బొక్క రాజేందర్ రెడ్డి, శీను నాయక్, సిద్దాల చిన్న బీరప్ప, నర్సిరెడ్డి, బాల్ రాజ్, సిద్దాల అంజ య్య, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సునీత బాలరాజ్, పంతంగి మాధవి, లలితా జగన్, నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.






