27 July, 2026 | 8:43 PM

Breaking News

పీఎంఈజీపీ రుణాల్లో అవకతవకలపై విచారణ చేపట్టాలి: బీజేపీ నేతల డిమాండ్   •   నూతన జిల్లా జడ్జికి ఘన స్వాగతం.. ఇన్‌చార్జి జడ్జికి వీడ్కోలు   •   తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ఆకారపు జయమ్మ ఎన్నిక   •   గత ప్రభుత్వ అలసత్వం వల్లనే గ్రామంలో పరిశుభ్రత లోపించింది   •   సీఈఐఆర్ పోర్టల్‌తో మొబైల్ ఫోన్ల రికవరీ   •   డీఏ, పీఆర్సీ మంజూరు చేయకుంటే ఉద్యమం తీవ్రతరం: పీఆర్టీయుటీఎస్   •   నర్సాపూర్ లో విత్తన మేళా   •   రహదారుల నిర్మాణంలో అడ్డంకిగా అటవీశాఖ   •   ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి   •   మధుసూదన చారి ఏ పార్టీ నుండి పోటీ చేస్తారో చెప్పాలి   •  

అమరవీరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

03-06-2026 01:56 AM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ, జూన్ 2 (విజయక్రాంతి): అమరవీరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తన నివాసం వద్ద,ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయ ఆవరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర,బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  RౄO రవీందర్ రెడ్డి, బాన్సువాడ పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయలక్ష్మి, బాన్సువాడ పట్టణ,రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.