తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
ఖమ్మం,(విజయక్రాంతి): జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనైనది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ శాసనసభ మాజి సభ్యులు కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, శ్రేణులతో కలిసి జాతీయ పతాకమును ఎగురవేసినారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ... ఈరోజు మనందరికీ ఎంతో పవిత్రమైన, చారిత్రాత్మకమైన రోజు అని, దశాబ్దాల ఆకాంక్ష, ఎందరో వీరుల పోరాట ఫలితంగా సాధించుకున్న మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరికీ గర్వకారణం.
తెలంగాణ ప్రజల హృదయ స్పందనను అర్థం చేసుకుని, వారి చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఆనాటి యు పి ఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం, పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ చేసిన అవిశ్రాంత పోరాటం వల్లే నేడు మనమంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛగా శ్వాస తీసుకుంటున్నాం. "నీళ్లు, నిధులు, నియమాలు" అనే నినాదంతో సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల పక్షానే నిలిచింది.ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదు.
వారి త్యాగఫలితమే ఈరోజుప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మరువకూడదు. వారి త్యాగఫలితమే ఈరోజు మనం చూస్తున్న స్వయంపాలనా తెలంగాణ.ఆనాడు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. నేడు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడానికి, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోంది. రైతులు, యువత, మహిళల అభ్యున్నతే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతోంది.గత పదేళ్ల పాలనలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను, ప్రజాస్వామ్య ఆకాంక్షల అణచివేతను అధిగమించి, ప్రజల ఆశయాలకు అనుగుణంగా బంగారు తెలంగాణను నిర్మించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని,
తెలంగాణ ప్రజల భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు పరుస్తున్న ప్రభుత్వ రథ సారథులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మరియు సహచర మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలిపి మనం అందరం ప్రజాపాలన గావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని,అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు విరించాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గడప గడపకు వెళ్లి వివరించాలని తద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలన్నారు.అదేవిధంగా మరోసారి తెలంగాణ అమరవీరులకు జోహార్లుఅర్పిస్తూ, ఖమ్మం జిల్లా ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని,జై హింద్! జై తెలంగాణ! అని అన్నారు.






