1 July, 2026 | 7:56 PM

Breaking News

ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •  

పికిల్‌బాల్‌లో అదరగొట్టిన తెలంగాణ

18-11-2025 12:00 AM

20 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన

బెంగళూరు, నవంబర్ 17 : దేశంలో అతివేగంగా ఆదరణ పొందుతున్న పికిల్‌బా ల్‌లో తెలంగాణ క్రీడాకారులు అదరగొడుతున్నారు. బెంగళూరు వేదికగా ముగిసిన పికిల్‌బాల్ నేషనల్స్‌లో తెలంగాణ జట్టు పతకాల పంట పండించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ అన్ని కేటగిరీల్లో కలిపి ఏకంగా 20 పతకాలు గెలుచుకుంది. కెప్టెన్ శ్రీకర్ మోతు కూరి పురుషుల టీమ్ 40+ విభాగంలో స్వర్ణం, 30+,40+ డబుల్స్+ విభాగాల్లో రెండు రజతాలు సాధించారు.

మహిళల విఙాగంలో ప్రీతి రెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచి ఒక రజతం, మూడు కాం స్యాలు గెలుచుకున్నారు. జూనియర్ స్థాయి లో సత్తా చాటుతున్న నాగ మోక్ష అండ ర్‌ఙూ సింగిల్స మిక్సిడ్ డబుల్స్‌లో రెండు స్వర్ణాలు సాధించింది. ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, 13 కాంస్యాలు దక్కాయి.

ఈ సందర్భంగా జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు గెలిచిన ప్లేయర్స్‌కు తెలంగాణ పికిల్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ, ఒలింపి యన్ విష్ణువర్థన్ అభినందనలు తెలిపారు. జాతీయ స్ఖాయిలో ఇలాంటి అద్భుత ప్రదర్శన కనబరిచి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు.