1 July, 2026 | 9:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

భారత ఆర్చరీ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు

18-11-2025 12:00 AM

న్యూఢిల్లీ, నవంబర్ 17 : ఢాకా వేదికగా జరిగిన ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. అద్భుత ప్రదర్శన కనబరిచి 6 స్వర్ణా లతో సహా 10 పతకాలు సాధించారు. పురుషుల రికర్వ్ ఈవెంట్‌లో దాదాపు 18 ఏళ్ల తర్వాత భారత్ పతకం గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో దీప్షిక, జ్యోతి సురేఖ వెన్నం, ప్రతీకా ప్రదీప్ స్వర్ణం కైవసం చేసుకున్నారు.

వ్యక్తిగత విభాగాల్లో అంకత భకత్, జ్యోతి సురేఖ వెన్నం కూడా బంగారు పతకాలు గెలుచుకున్నారు. ఇక పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో ధీరజ్ బొమ్మదేవర స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. భారత ఆర్చరీ చరితరలో ఆసియా చాంపియన్‌షిప్‌కు సంబంధించి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. కాగా భారత ఆర్చ రీ క్రీడా కారులను అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీచ్ చేశారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారంటూ ప్రశంసించారు.