23 April, 2026 | 6:33 PM

తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం

23-04-2026 05:11 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం(Telangana Cabinet meeting) ప్రారంభమైంది. కాళేశ్వరం అంశంలో హైకోర్టు తీర్పుపై కేబినెట్ చర్చించనుంది. హైకోర్టు తీర్పుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. ఎంపీటీసీ, జడ్పీ టీసీ ఎన్నికలపై చర్చించే అవకాశముంది. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలుపై నిర్ణయం వెలువడే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా,  కేబినెట్ భేటీలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై చర్చించాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.