23 April, 2026 | 6:30 PM

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్

23-04-2026 04:59 PM

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy) అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలోకి వస్తే మరో మాట సరికాదని జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ... ఎవరూ మాట మార్చినా తప్పే, రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా మాట మార్చటం తప్పే అన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించి.. అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు అని జగ్గారెడ్డి తేల్చిచెప్పారు. జగ్గారెడ్డి ఎక్స్ లో పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె వేళ జగ్గారెడ్డి వ్యాఖ్యలు పోస్టు సంచలనంగా మారింది.