31 August, 2026 | 5:53 PM

Breaking News

తిరుమలగిరిలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం

31-08-2026 12:00 AM

తిరుమలగిరి,  ఆగస్టు 30 : తిరుమలగిరి మండల కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఫాతిమా హైస్కూల్లో ఉద్యమకారులు  సంకెపల్లి రఘునందన్ రెడ్డి, అబ్దుల్ గఫార్ ఖాన్ నిర్వహణలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలు, హక్కులు, సంక్షేమం మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.ఉద్యమకారులందరినీ ఐక్యంగా సమన్వయం చేసుకుంటూ, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం అందించాల్సిన గుర్తింపు, గౌరవం, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని నాయకులు కోరారు. మండల పరిధిలోని ప్రతీ ఉద్యమకారునికి న్యాయం జరిగేలా ఈ వేదిక పని చేస్తుందని తెలిపారు.ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు ఎండి రహమాన్ అలీ, మోడపు సురేందర్ గౌడ్,తోట ఉపేందర్, కన్నెబోయిన రమేష్ యాదవ్, ఎండి అబ్బాస్,వేల్పుల వీరనారి, ఎస్.కె.చాంద్ పాషా,గూడా సాయిబాబా, పాక సోమయ్య,కొండ నరేష్, ఎల్లేంల మహేష్ తదితరులు పాల్గొన్నారు.