23 August, 2026 | 6:04 PM

బంజారా సంస్కృతికి ప్రతీకగా తీజ్ పండుగ వేడుకలు

23-08-2026 04:59 PM

భాగ్యనగర్ తండాలో ఘనంగా తీజ్ నిమర్జన కార్యక్రమం

కారేపల్లి ఆగస్టు 23(విజయ క్రాంతి): బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ తీజ్ అని భాగ్యనగర్ తండా సర్పంచ్ హిరాలాల్ అన్నారు. తీజ్ పండుగ సందర్భంగా గ్రామంలో డీజే లను ఏర్పాటు చేసి బంజారా సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా తొమ్మిది రోజులుగా యువతులు భక్తిశ్రద్ధలతో తీజ్ పూజలు నిర్వహించి, నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవతలకు నైవేద్యాలు సమర్పించి, బంజారా సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు.

ప్రకృతిని, పంటలను, పశుసంపదను గౌరవించే బంజారా సమాజంలో తీజ్ పండుగకు విశిష్ట స్థానం ఉందని సర్పంచ్ బానోత్ హీరాలాల్ తెలిపారు. తీజ్ పండుగ ప్రజలందరినీ ఒక్కచోట చేర్చి ఐక్యతను చాటుతుందన్నారు.ఈకార్యక్రమంలో పూజారి మంగ్తు సేవాలాల్ కాంగ్రెస్ జిల్లా నాయకులు గుగులోత్ భీముడు నాయక్, బానోత్ రాందాస్ నాయక్, లకావత్ దామ్లా, భగవాన్ దాస్, బానోత్ రాంచందర్, బానోత్ మంగీలాల్, లావుడ్యా ఈర్య, భూక్యా తారాచంద్ తదితరులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు