తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి
23-08-2026 05:03 PM
ముకరంపుర, ఆగస్టు 23 (విజయ క్రాంతి): రాష్ట్ర సాధన కోసం నిజాయితీగా, స్వతంత్రంగా పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన గౌరవం కల్పించాలని తెలంగాణ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి శివరాజ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం లేని వ్యక్తులను కాకుండా, ఉద్యమ సమయంలో ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిజంగా పోరాడిన వారినే పారదర్శకమైన విధానంలో గుర్తించాలని కోరారు.






