భక్తిశ్రద్ధలతో శబరిమాత పాదపూజ
23-08-2026 05:52 PM
భారీగా తరలివచ్చిన భక్తులు
బోథ్. ఆగస్టు 23 (విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామంలో అఖండ జ్యోతి కార్యక్రమం ఆదివారం నాటికి 11రోజులకు చేరుకుంది. రోజుకు ఒక గ్రామం చొప్పున భక్తులు ఆశ్రమానికి చేరుకొని భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కజ్జర్ల గ్రామానికి చెందిన భక్తులు చేరుకున్నారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమాలను అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకాంత్ ఆర్కెస్ట్రా బృందం వారు ఆలపించిన భక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కనుగుట్ట లోని శబరిమత ఆశ్రమ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి. అన్నదాన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పాదపూజ కార్యక్రమాన్ని పూజారి ధర్మారెడ్డి చేతల మీదుగా గావించారు.






