23 August, 2026 | 6:04 PM

మంథనిలో నూతన వధూవరులకు ఆశీర్వదం

23-08-2026 05:05 PM

మంథని, ఆగస్టు 23(విజయ క్రాంతి): మంథని పట్టణానికి చెందిన చిటికేసి రాజన్న–రమాదేవి దంపతుల కనిష్ట పుత్రిక దివ్య–సాయికృష్ణల వివాహ వేడుకలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను శ్రీను బాబు ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో కొనసాగాలని ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ వైస్ చైర్మన్ ముసుకుల సహిందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.