కలెక్టరేట్ ఎదుట ధర్నాకు తరలిన ఉపాధ్యాయులు
నేరేడుచర్ల, ఆగస్టు 27: రాష్ట్ర ఉద్యోగ, ఉ పాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సంఘం పిలుపు మేరకు పెండింగ్ లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం దశల వారీ పోరాటంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమానికి నేరేడు చర్ల నుండి ఉపాధ్యాయులు తరలివెళ్లారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, రెం డవ వేతన సవరణను వెంటనే అమలు చే యాలి,ఆరు కరువు భత్యాలను వెంటనే వి డుదల చేయాలి, విరాళాల ఆధారిత పింఛను విధానాన్ని రద్దు చేసి పాత పింఛను వి ధానాన్ని పునరుద్ధరించాలన్నారు.
ప్రతి నెల పదవీ విరమణ అయ్యే వారికి ఇచ్చే బకా యిలు మూడు వేల కోట్ల వరకు చెల్లించాలి, ఇరవై ఐదవ ప్రభుత్వ ఉత్తర్వును సవరించి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని కేటా యించాలన్నారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సక్రమంగా అమలు చేయాలనే తదితర సమస్యలను పరిష్కరించాలని నా యకులు డిమాండ్ చేశారు. తరలి వెళ్ళిన వా రిలో జిల్లా ఉపాధ్యాయ సంఘం ప్రధాన కా ర్యదర్శి ఎస్. అనిల్ కుమార్,జిల్లా ఉపా ధ్యాయ సంఘం నాయకులు ఆర్. శ్రీనయ్య, ఎన్. నరసింహారావు, సిహెచ్. వెంకటే శ్వరరావు, కె. వెంకటేశ్వరరావు, కె. అన్నపూర్ణ తదిత రులు పాల్గొన్నారు.






