28 August, 2026 | 5:17 AM

వరి పంటలో సమగ్ర యాజమాన్యంపై క్షేత్రస్థాయి ప్రదర్శన

28-08-2026 02:31 AM

మొయినాబాద్ ఆగస్టు 27(విజయక్రాంతి): ఆత్మ (ATMA) కార్యక్రమం ఆధ్వర్య ంలో మొయినాబాద్ మండలంలో వరి ప ంటలో సమగ్ర పోషక యాజమాన్యం (IN M), సమగ్ర చీడపీడల యాజమాన్యం (IP M)పై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. రెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు జగదీశ్వర్ రెడ్డి, పెద్దమంగళారం గ్రామానికి చెందిన రైతు ఎం. కృష్ణారెడ్డి పొలాలను పరిశీలించి, పంట ఎ దుగుదల, పోషక లోపాలు, చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.

ప ంటలో నేల ఆరోగ్యం, వేర్ల అభివృద్ధి, పోషకాల సమర్థ వినియోగం కోసం ట్రైకోడెర్మా, పీఎస్బీ, జింక్ పౌడర్తో పాటు నానో యూ రియా, నానో డీఏపీ, కలుపు నివారణ మం దులను రైతులకు అందజేశారు. సమతుల్య ఎరువుల వినియోగం, జీవ ఎరువులు, సూ క్ష్మపోషకాల వినియోగంతో పాటు చీడపీడలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన ని వారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అ వసరం లేకుండా పురుగుమందులు వాడవద్దని తెలిపారు. కార్యక్రమంలో ఏవో పి.అనురాధ, వ్యవసాయ విస్తరణ అధికారులు దీనా, శ్రీనివాస్ పాల్గొన్నారు.