9 April, 2026 | 7:29 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ప్రవేట్ పాఠశాలలో దారుణం

09-04-2026 05:18 PM

విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన ఉపాధ్యాయురాలు

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం జిల్లెల గ్రామంలోని క్రాసింగ్ ఉన్న విజ్ఞాన్ విద్యానికేతన్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతున్న సోఫియా అనే విద్యార్థిని ఉపాధ్యాయురాలు ఇష్టం వచ్చినట్లు చితకబాదింది. విద్యార్థి శరీరంపై దద్దులు వచ్చేలా కట్టెతో విచక్షణారహితంగా కొట్టింది. హోంవర్క్ నీటుగా చేయలేదు అనే కారణంతో విద్యార్థి సోఫియాపై దాడి  చేసింది.

పాఠశాలల్లో ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థులు ముఖ్యంగా బాలికలు శారీరక దాడులకు గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్న ఉపాధ్యాయులు తీరు మార్చుకోకపోగా మళ్లీ.. మళ్లీ దాడి ఘటనలు పునరావృతం అవ్వడం చాలా బాధాకరమని స్థానికులు వాపోయారు. కాగా ఈ పాఠశాల నిర్వాహకులు ఫీజుల విషయంలో కూడా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ బయట ఎండలో నిలబెడుతున్నారనే తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు(Education Department Officials) విచారణ చేసి పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు,విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.