4 April, 2026 | 12:47 PM

వెల్దండలో యువకుడి దారుణ హత్య

04-04-2026 11:07 AM

మొదట టిప్పర్ తో ఢీ కొట్టి బండరాళ్ళతో మోదీ హత్య. 

వెల్దండ,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల(Veldanda mandal) కేంద్రానికి చెందిన రుద్రాక్షల మహేష్ (28) అనే యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన శనివారం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, మహేష్ వ్యక్తిగత పనులు ముగించుకుని శుక్రవారం రాత్రి కారులో వెల్దండ నుంచి పొథెపల్లి రోడ్డులోని తన పొలం వైపు వెళ్తుండగా, కంకర క్రషర్ నుంచి వెల్దండకు వస్తున్న టిప్పర్ వాహనం ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు.

అయితే పాత కక్షలు మనసులో పెట్టుకున్న కొందరు వ్యక్తులు ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని, గాయాలతో పడిపోయిన మహేష్‌ను రాళ్లతో మోది హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లేదా హతమార్చేందుకు మొదట ఇప్పర్తో ఢీకొట్టేందుకు ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు. శనివారం ఉదయం వెల్దండ సీఐ రఘువీర్ రెడ్డి, ఎస్సై కురుమూర్తి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.