22 July, 2026 | 1:59 AM

టీసీఎస్ హెచ్‌ఆర్ హెడ్ లీడర్‌షిప్ టాక్

22-07-2026 12:22 AM

ఏసీఈ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహణ

హైదరాబాద్, జులై 21(విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఏసీఈ ఇంజినీరింగ్ కాలేజీ(అటనామస్), టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) సహకారంతో నేవిగేటింగ్ ఆపర్టూనిటీ, ఇంటర్వ్యూస్, స్కిల్స్’ అంశంపై లీడర్‌షిప్ టాక్ కార్యక్రమం నిర్వహించారు. ఐటీ ఇండస్ట్రిలో విజయవంతమైన కేరీర్‌కు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశ్యం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్‌ఆర్ హెడ్ సౌమ్య మారెడ్డి విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు. విద్యార్థులు నిరంతరం అప్ స్కిల్లింగ్, ప్రొబ్లెమ్ సాల్వవింగ్ స్కిల్స్ పెంపొందించుకోవాలని, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమను తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

అనంతరం నిర్వహించిన ఇంటెరాక్టివ్ సీజన్‌లో విద్యార్థులు ప్లేస్‌మెంట్స్, హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంటర్యూ స్ట్రాటెజిస్, ఐటీ ఇండస్ట్రీ కేరిర్ అవకాశాలపై టీసీఎస్ హెచ్‌ఆర్ హెడ్‌తో చర్చించి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు విలువైన అవగాహన లభించింది.

ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ వైవీ గోపాలకృష్ణమూర్తి ఫౌండర్ అండ్ జనరల్ సెక్రటరీ, ఏసీఈ ఇంజినీరింగ్ అకాడమీ, ఏసీఈ ఇంజినీరింగ్ కాలేజీ డైరెక్టర్ మమతరావు పసుమర్తి, డాక్టర్ ఎన్.సుధాకర్‌రెడ్డి ప్రిన్సిపాల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎస్.ఫణింద్ర, హెడ్ కార్పొరేట్ రిలేషన్స్‌కు స్వాగతం పలకగా వైవీఎస్ దుర్గాప్రసాద్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ధన్యవాదాలు తెలపారు. కార్యక్రమాన్ని డాక్టర్ కిరణ్ కుమార్ అల్గాట్, ఫ్యాకల్టీ కోఆర్టినేటర్ రిలేషన్స్ సమర్ధవంతంగా సమన్వయం చేశారు.