హెచ్‌సీఏ ఆటోమేటిక్ సెలెక్షన్‌పై టీసీఏ ఆగ్రహం
- లోధా సంస్కరణలు, పారదర్శకతకు విరుద్ధమని ఆరోపణ
- ప్రతిభే ఎంపికకు ప్రామాణికం కావాలన్న గురువారెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 22: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 2026-27 సీజన్‌కు ప్రకటించినట్లు చెబుతున్న మెన్స్ సీనియర్ సూపర్ లీగ్‌కు ఆటోమేటిక్ సెలెక్షన్’ విధానంపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విధానం ప్రస్తుత ప్రతిభ, సెలెక్టర్ల స్వతంత్రత, పారదర్శకతను దెబ్బతీస్తోందని, జస్టిస్ ఆర్.ఎం. లోధా కమిటీ సంస్కరణల స్ఫూర్తికి, బీసీసీఐ పాలనా ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని టీసీఏ ఆరోపించింది.
టీసీఏ జనరల్ సెక్రటరీ ధర్మ గురువా రెడ్డి మాట్లాడుతూ, క్రికెట్ లో ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్, ప్రదర్శన, ప్రతిభే ఎంపికకు ప్రాథమిక ప్ర మాణాలు కావాలి. గత సీజన్ ప్రదర్శన ఆధారంగా ప్రస్తుత సీజన్‌కు ఆటోమేటిక్ సెలెక్షన్ హక్కు ఎలా వస్తుంది? ఇది సెలెక్టర్ల స్వతంత్రతను, మెరిట్ ఆధారిత ఎంపికను దెబ్బతీయ దా? అని ప్రశ్నించారు.
గత సీజన్‌లో ఆడినందుకు లేదా గత ప్రదర్శన ఆధారంగా ఆటగాళ్లకు ఆటోమేటిక్ అర్హత కల్పించడం వల్ల ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్న జిల్లా, ఓపెన్ ట్రయల్స్ మరియు ఎమ ర్జింగ్ ఆటగాళ్లకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా సీవోసీ, హెచ్ సిఏ పరిపాలనా అధికారుల పాత్ర, ముఖ్యంగా మాజీ భారత క్రికెటర్, హెచ్‌సీఏ కోఆర్డినేటర్ అంబటి రాయుడు పాత్రపై కూడా టీసీఏ స్పష్టత కోరింది.
సెలెక్షన్ ప్రక్రియను పరిపాలనా జోక్యానికి అతీతంగా ఉంచాలనీ, క్రికెట్‌కు సంబంధించిన నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగా నియమించబడిన సెలెక్టర్లు, స్పష్టమై న, నిష్పాక్షిక ప్రమాణాల ఆధారంగా తీసుకోవాలని గురువారెడ్డి అన్నారు. సీవోసీ, ఇతర పరిపాలనా సంస్థకు తప్పనిసరి సెలెక్షన్ ప్రమాణాలు విధించే అధికారానికి సంబంధించిన బైలాస్ నిబంధనలు బహిర్గతం చేయాలనీ డిమాండ్ చేశారు.






