1 August, 2026 | 1:55 AM

అలుగు పారుతున్న చెరువులు

01-08-2026 01:07 AM

చేపల వేటలో యువకులు

ఉట్నూర్, జులై 31 (విజయక్రాంతి): మూడు రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టులు సైతం నిండుకున్నాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండుకొని మత్తడి పారుతుండటంతో నీటితో పాటు చేపలు బయటకు వెళుతున్నాయి. యువకులు దోమతెరలు, గోడుగులు, చీరలతో చేపలను పడుతున్నారు.

ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ లోని త్రివేణి సంగమం ప్రాజెక్టు నిండి వర్షం నీరు బయటకు ప్రవహించడంతో చుట్టు గ్రామాల గిరిజనులు శుక్రవారం ఉదయమే అలుగుల వద్దకు చేరుకొని చేపలు పట్టడం మొదలు పెట్టారు. ప్రాజెక్టులో నించి ఐదు నుంచి 15 కిలోల బరువు ఉన్న చేపలు సైతం కొట్టుకువస్తుండటంతో వాటిని పట్టుకోవడంలో స్థానికులు నిమగ్నమయ్యారు.