8 March, 2026 | 2:00 AM

TSUTFకు తంగళ్లపల్లి మండల శాఖ మూకుమ్మడిగా రాజీనామా

06-03-2026 07:28 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) మండల శాఖకు చెందిన నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఇటీవల TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా నాయకత్వం విషయంలో రాష్ట్ర కమిటీ మరియు జిల్లా నాయకత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని వారు ఆరోపించారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నందుకు నిరసనగా మండల శాఖ మొత్తం తమ పదవీ బాధ్యతలకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. 

రాజీనామా చేసిన వారిలో మండల అధ్యక్షుడు కొక్కుల బాలరాజు, ప్రధాన కార్యదర్శి సుధీర్ కుమార్, ఉపాధ్యక్షుడు చింతకింది నాగరాజు, కోశాధికారి చామంతుల ఆంజనేయులు, మహిళా ఉపాధ్యక్షురాలు కోడం ప్రశాంతి, మండల కార్యదర్శి పోకల కిరణ్, మండల కార్యదర్శి పసుల సరిత ఉన్నారు. మండలంలోని TSUTF సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.