8 May, 2026 | 11:02 AM

కొలిక్కిరాని తమిళనాడు రాజకీయాలు

08-05-2026 10:00 AM

చెన్నై: తమిళనాడు రాజకీయాలు కొలిక్కిరాలేదు. టీవీకేకు మద్దతుపై సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు నేడు నిర్ణయం తీసుకోనున్నారు. సీపీఎం, సీపీఐ, వీసీకే పార్టీలు ఇప్పటివరకు డీఎంకే కూటమిలోనే ఉన్నారు. మూడు పార్టీల నిర్ణయంపై విజయం ఆశాభావంతో ఉన్నారు. మూడు పార్టీలు మద్దతుకు నిరాకరిస్తే ప్రత్యామ్నాయాలపై విజయ్ సమాలోచనలు చేస్తున్నారు. గవర్నర్ తీరుపై కోర్టుకు వెళ్లాలని విజయ్ నిర్ణయం తీసుకోనున్నారు.

నిన్న రాత్రి 2 గంటల పాటు న్యాయ నిపుణులతో విజయ్ చర్చించారు. గతంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై ఆరా తీశారు. పుదచ్చేరి రిసార్ట్ లో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. తాజా పరిణామాలపై నిన్న రాత్రి సీఎస్, డీజీపీతో గవర్నర్ ఆర్లేకర్ సమావేశమయ్యారు.  గవర్నర్ వ్యవహారశైలిపై నేడు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చారు.

తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చెన్నైలోని లోక్ భవన్ వెలుపల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే నాయకుడు విజయ్‌ను ఇంకా ఆహ్వానించనందుకు, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనను ప్రకటించింది. ఇప్పటికే టీవీకేకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, ప్రజల తీర్పును గౌరవించాలని, ప్రజాస్వామ్య ప్రక్రియ ఆలస్యం లేకుండా ముందుకు సాగాలని డిమాండ్ చేస్తోంది.