8 May, 2026 | 11:20 AM

విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఆర్లేకర్ రియాక్షన్

08-05-2026 10:24 AM

చెన్నై: టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ(Vijay Government) ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్(Governor Rajendra Vishwanath Arlekar) స్పందించారు. నేను సంతృప్తి చెందినదే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వలేనని గవర్నర్ పేర్కొన్నారు.  మెజార్టీపై సంతృప్తి చెందాకే టీవీకేకు అవకాశమిస్తానని ఆయన తెలిపారు. ఇది విజయ్ సమస్య కాదు.. రాష్ట్రప్రజల సమస్య అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే కలిసి ప్రభుత్వ ఏర్పాటు చేస్తాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే కలయిక వార్తలపై టీవీకే అధినేత విజయ్ స్పందించారు.

డీఎంకే, అన్నాడీఎంకేకు(All India Anna Dravida Munnetra Kazhagam) విజయ్ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. డీఎంకే, అన్నాడీఎంకే కలిస్తే టీవీకే సభ్యులందరం రాజీనామా చేస్తామని విజయ్ వెల్లడించారు.మరోవైపు అన్నాడీఎంకే క్యాంపు రాజకీయాలు(AIADMK Camp Politics) నడుపుతోంది. తమ ఎమ్మెల్యేలందరినీ పుదుచ్చేరిలోని రిసార్ట్ కు తరలించారు. నిన్న రిసార్ట్ లోని ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే నేత పళనిస్వామి సమావేశం అయ్యారు. త్వరలోనే మంచి జరగనుందని పళనిస్వామి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో చెప్పారు. పళనిస్వామి వేసే తదుపరి అడుగులపై తమిళనాడులో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.