24 April, 2026 | 4:42 PM

Breaking News

గర్భిణీ స్త్రీలకు చిన్నారులకు అంగన్వాడిల ద్వారా సేవలు అందించాలి   •   మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలి: సర్పంచ్ ఆడారపు హరికృష్ణ   •   దళితుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించండి   •   పేదల పెన్నిధి - సీఎం సహాయ నిధి: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి   •   ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేసిన ఎంపీడీవో   •   పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ   •   సొంతింటి కల నెరవేర్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదే   •   శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు.. సర్కార్ చేసిన హత్యే   •   రీస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడికి అభినందనలు   •   ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు   •  

ఎన్ఎంఎంఎస్ లో నర్మెట్ట విద్యార్థుల ప్రతిభ

24-02-2026 09:27 PM

నంగునూరు,(విజయక్రాంతి): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్ఎంఎంఎస్) ఫలితాల్లో నర్మెట్ట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.పాఠశాలకు చెందిన గొట్టే శివకుమార్, మోటకోడూరు జనని, చెలిమెల శశిధర్ రెడ్డి ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఈ పరీక్షలో ఎంపికైన వారికి 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని ఆయన తెలిపారు. విద్యార్థుల విజయంపై పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.