రాష్ట్ర స్థాయి క్రీడల్లో సిద్దిపేట పోలీసుల సత్తా విజేతలకు సీపీ అభినందనలు
సిద్దిపేట క్రైం: నాలుగో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు, స్పోర్ట్స్ మీట్ లో సిద్దిపేట పోలీసులు సత్తా చాటారు. అద్భుత ప్రతిభ కనబరిచిన సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రీడల్లో సిద్దిపేట పోలీస్ యూనిట్ నుండి మొత్తం 9 మంది వివిధ విభాగాల్లో పోటీపడి, తమ ప్రతిభను ప్రదర్శించారు.
మొత్తం 12 పతకాలను సాధించి సిద్దిపేట పోలీస్ శాఖ సత్తాను రాష్ట్ర స్థాయిలో చాటారు. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రోహిత్, సబ్ ఇన్స్పెక్టర్ అంజయ్య, కానిస్టేబుల్ డి.రాజు బంగారు పతకాలు సాధించారు. డి.లక్ష్మణ్, జె.రాజు వెండి పతకాలు పొందారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని సీపీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఇన్స్పెక్టర్లు కిరణ్, శ్రీధర్ గౌడ్ పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.




