తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోండి
యువతకు ధోనీ పిలుపు
మెరిల్ క్యాంపెయిన్‌కు మద్ధతు
వాపి, మార్చి 23 : తమ తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోవడం ప్రతీ ఒక్క రి బాధ్యతని భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. గుజరాత్ వాపిలోని మెరిల్ క్యాంపస్‌ను సందర్శించిన ధోనీ బచ్‌పానా షుడ్ నాట్ రిటైర్ క్యాంపెయిన్‌కు మద్ధతు తెలిపాడు. ప్రజల ఆరోగ్య విషయంలో దేశవ్యాప్తంగా మెరిల్ చేస్తున్న ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళతానని చెప్పా డు. ట్రీట్‌మెంట్ జరూరి హై నినాదంతో క్యాంపెయిన్‌ను ధోనీ ప్రారంభించాడు.
ఈ సందర్భంగా ధోనీ ఆసక్తికర విషయాలను పంచుకున్నా డు. తన కెరీర్ ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ ఉందన్నాడు. అలాగే ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయవంతం కావాలంటే తల్లిదండ్రుల ప్రోత్సా హం ఉండాలన్నాడు. వృధ్ధాప్యంలో వారిని చూసుకోవాల్సిన బాధ్యత యువతదేనని ధోనీ పిలుపునిచ్చాడు.
తల్లిదండ్రులతో పాటు తాతయ్య, నానమ్మ వంటి వృద్ధుల ఆరోగ్యాన్ని సం రక్షించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యతగా చెప్పిన ధోనీ ఇలాం టి క్యాంపెయిన్‌లో తాను భా గం కావడం సంతోషంగా ఉం దన్నాడు. కాగా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లతో దేశవ్యాప్తంగా తల పెట్టిన ఈ క్యాంపెయిన్ యువత తమ చిన్ననాటి సరదా ఆటలను గుర్తు చేసుకుంటూ తాతయ్య,నానమ్మలతో గడిపిన సమయాలను తిరిగి ముందుకు తీసుకొచ్చేందుకు ప్రోత్సహిస్తోంది. వృధ్యాప్యంలో పెద్దవారి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం పెద్ద బాధ్యత అంటూ గుర్తు చేస్తున్న మెరిల్‌ను ధోనీ ప్రత్యేకంగా అభినందించాడు.




