21 March, 2026 | 6:36 PM

Breaking News

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

21-03-2026 12:00 AM

అదనపు కలెక్టర్ జి.వి. శ్యాం ప్రసాద్ లాల్

వెల్దండ మార్చి 20 : ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని జిల్లా అదన కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ అన్నారు . శుక్రవారం వెల్దండ మండలం, చుక్కనపల్లిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించారు. తోట నిర్వహణ, మొక్కల పెరుగుదల, నీటి వినియోగం వంటి అంశాలను తెలుసుకున్నారు. రైతులకు మరింత సాంకేతిక మార్గదర్శకత అందించాలని అధికారులకు సూచించారు.

బొల్లంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన క్యాటిల్ షెడ్ను సందర్శించి, పశుసంవర్థక కార్యకలాపాలకు ఇది ఉపయోగకరంగా ఉండేలా నిర్వహణపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. గుండాల గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన సామూహిక మరుగుదొడ్ల సముదాయమునును పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామస్థులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పనుల్లో పారదర్శకత, నాణ్యత, సమయపాలన పాటించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఓ, ఎంపీడీవో, ఎంపీవో, ఈసీ, టిఏలు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.