calender_icon.png 13 February, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి

13-02-2026 12:19:25 AM

  1. వట్టె జానయ్య కుమారుడిపై దాడి దురదృష్టకరం

టీఆర్పీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య 

హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం 13వ వార్డు లో జరిగిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు మామిడి అంజ య్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో కారు ఎక్కేందుకు వెళ్తున్న టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జ్ వట్టె జానయ్య కుమా రుడిపై దాడి జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఘటనకు బాధ్యులైన ఎస్‌ఐ ఏడుకొండలు, సీఐ రాజశేఖర్‌లపై తక్షణమే చర్యలు తీసుకుని, సస్పెండ్ చేయాలని డి మాండ్ చేశారు.

ఆయనవెంట సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, సూ ర్యాపేట మహిళా అధ్యక్షురాలు కొన్నెమంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదా సు కవిత, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండలాధ్య క్షు డు అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ ముర ళి మనోహర్, రంగన్న, వర్మ, గో పి, రంప శ్రీదేవి, తండు నాగలక్ష్మి, వాల్మీకి దీపమాల, కంటేకర్ రఘు మోహన్, మధు ప్రజాపతి, బోడపట్ల మధు, సురేష్, వంశీ ఉన్నారు.