13-02-2026 12:18:05 AM
గచ్చిబౌలి- పరిధి గోపన్‌పల్లిలో ఘటన
తెల్లాపూర్‌లో వ్యాన్‌ను గుర్తించిన పోలీసులు
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ గచ్చిబౌలిలో గురువారం గోపన్‌పల్లి ప్రాం తంలో ఏటీఎం వ్యాన్ డ్రైవర్ రూ.57 లక్షల భారీ నగదుతో పరారయ్యాడు. క్యాష్ మేనే జ్మెంట్ సర్వీసెస్‌కు చెందిన ఒక వాహ నం గురువారం మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్‌ప ల్లిలో ఉన్న యా క్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌కు చేరుకుంది.
ఆ వాహనంలో డ్రైవర్ అజిత్ అలియాస్ శివతో పాటు ఇద్దరు కస్టోడియ న్లు, ఒక సెక్యూరి టీ గార్డు గన్‌మన్ ఉన్నారు. ఏటీఎం లో నగదు నింపేందుకు ఇద్దరు కస్టో డియ న్లు డబ్బు తీసుకుని బ్యాంక్ లోపలికి వెళ్లా రు. అదే సమయంలో సెక్యూరి టీ గార్డు వాష్‌రూంకు వెళ్లాడు. వాహనంలో ఎవరూ లేకపోవడాన్ని గమ నించిన డ్రైవర్ అజిత్.. క్షణాల్లో వాహనాన్ని స్టార్ట్ చేసి, అందులో ఉన్న రూ.57 లక్షల నగదుతో సహా ఉడా యించాడు.
సిబ్బంది తిరిగి వచ్చి చూసేసరికి వాహ నం కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. గ్రచ్చిబౌలి పోలీసులకు సమా చారం అందించారు. పోలీసులు జీపీ ఎస్ ట్రాకింగ్, సీసీటీవీల ఆధారంగా గాలిం పు చేపట్టారు. నిందితుడు వ్యాన్‌ను తెల్లాపూర్ సమీపంలోని నిర్జన ప్రదేశంలో వదిలేసి, నగదుతో పరారైనట్లు గుర్తించారు. నిందితు డిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.