బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్
23-06-2026 04:11 PM
పాలకవీడు: భారతీయ జనతా పార్టీ పాలకవీడు మండల పార్టీ కార్యాలయంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు రమావత్ నరీ నాయక్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రమావత్ నరి నాయక్ మాట్లాడుతూ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమగ్రత, జాతీయ ఏకత్వం కోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొoటూ, భారతదేశ ఐక్యత కోసం ఆయన చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు.






