23 June, 2026 | 5:34 PM

బడిబాటలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

23-06-2026 04:06 PM

జైనూర్,(విజయక్రాంతి): రాశిమెట్ట ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సోమవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పాల్గొని విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.తాను ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్న సుగుణ, బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలకు తీసుకురావడంలో తన కృషిని వివరించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువులో రాణించాలని సూచించారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ప్రజాసేవలోకి వచ్చానని, గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీ చేశానని గుర్తుచేశారు. గిరిజన ప్రాంతాల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.