23 June, 2026 | 6:32 PM

బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ

23-06-2026 05:17 PM

కల్పన గంపకు చైతన్య యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం

- సాంకేతిక పురోగతి సామాజిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి -డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి

మొయినాబాద్,(విజయక్రాంతి): సాంకేతిక, శాస్త్రీయ పురోగతులు సామాజిక ఆకాంక్షలు, అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా ఉండాలని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి అన్నారు. మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్‌లోని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన పరిశోధకురాలు కల్పన గంపకు పీహెచ్‌డీ డిగ్రీ ప్రదానం చేశారు. ఆమె ఈ-కామర్స్ డేటా అనాలిసిస్ అండ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫార్మ్ ఇన్ ది ఎరా ఆఫ్ బిగ్ డేటా అనే అంశంపై డాక్టర్ వి. మధుకర్ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించారు.

ఈ సందర్భంగా డాక్టర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ రంగంలోని పరిశోధనలు దేశ, రాష్ట్ర అభివృద్ధికి కీలకమని అన్నారు. బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ డేటా విశ్లేషణ, భద్రతా వ్యవస్థలపై నిర్వహించిన ఈ పరిశోధన ప్రస్తుత కాలానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఇటువంటి పరిశోధనలు దేశానికి గర్వకారణంగా నిలవడంతో పాటు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తాయని తెలిపారు.