19 May, 2026 | 1:44 AM

సింపుల్ ఈ-గవర్నెన్స్‌కు వెళ్లండి

19-05-2026 12:32 AM
  1. తమిళనాడు విధానాన్ని పరిశీలించండి
  2. రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర సీఎస్ ఆదేశం

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింపుల్ ఈ-గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రెటరీ డాక్టర్ టీవీ సోమనాథన్ ఆయా రాష్ట్రాల సీఎస్‌లను ఆదేశించారు. సోమవారం ఆయా రాష్ట్రాల సీఎస్‌లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమిళనాడు ప్రభు త్వం అనుసరిస్తున్న సింపుల్ గోవ్ ఈ-గవర్నెన్స్ విధానాన్ని ఆయా రాష్ట్రాల్లో నిబంధనల మేర కు ప్రజలకు సరళతరమైన, మెరుగైన ప్రభుత్వ సేవలను అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎ స్ రామకృష్ణారావు రాష్ట్రంలో ప్రభుత్వం అమ లు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానాన్ని వివరించారు.

ప్రజలకు పారదర్శకంగా, సులభతర మైన పౌర సేవలను అందిస్తున్నామని, ఎప్పటికప్పుడు వివిధ విభాగాల వారీగా ఆన్‌లైన్ లో డ్యాష్‌బోర్డుల ద్వారా తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. దీంతో సీఎస్ రామకృష్ణారావును కేంద్ర సీఎస్ అభినందించారు. తమిళనాడు ప్రభుత్వ విధానాన్ని కూడా అధ్యయనం చేసి, ప్రజలకు రాష్ట్రంలో ఈ-గవర్నెన్స్ విధానాల్లో మార్పులు చేస్తామని సీఎస్ తెలిపారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ నవీన్ మిట్ట ల్, ముఖ్య కార్యదర్శి యోగితారాణా, షికాగోయల్, సెక్రటరీలు రఘునం దన్‌రావు, ఈ శ్రీధర్, అనితా రామచంద్రన్, హౌసింగ్ ఎండీ వీపీ గౌతం, సెర్ప్ సీఈవో దివ్య పాల్గొన్నారు.