19 May, 2026 | 1:46 AM

బడా భీంగల్‌లో పార్శ్వనాథుడి శిల్పం

19-05-2026 12:34 AM

కనుగొన్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం 

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): కొత్త తెలంగాణ చరిత్ర బృం దం క్షేత్రస్థాయి సందర్శన, పరిశోధనలో భాగంగా భీంగల్ మండలంలోని బడా భీంగల్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వ ర స్వామి దేవాలయాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంక ణాల రాజేశ్వర్ సందర్శించారు. రాజేశ్వరాలయ ప్రాంగణంలోని వేపచెట్టు కింద ఒక విగ్రహాన్ని కనుగొన్నారు.

ఆ ప్రతిమా లక్షణాల్ని రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ వివరించారు. 23వ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుని ధ్యానాసన శిల్పం. తలపై ముగ్గొడుగులు (త్రిస్త రచ్ఛత్రం) ఉన్నాయి. తోరణం మీద మామిడికాయలు అలంకరించడం కొత్త శైలి. ఇది చాళుక్యుల నాటి శిల్పం అని అన్నారు.

కంకణాల రాజేశ్వర్ మాట్లాడుతూ.. తీర్థంకరుడు అంటే వంతెన నిర్మించేవాడని అర్థం, జైన మతంలోని 24 మంది తీర్థంకరులలో 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు క్రీ.పూ. 8వ శతాబ్దంలో కాశీ(వారణాసి)నగరంలో ఇక్ష్వా కు రాజు అశ్వసేనుడు, రాణి వామదేవి సం తానం. తన 30వ ఏట లౌకిక సుఖాలను త్యజించి సన్యాసిగా మారాడు. తీవ్రమైన త పస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. నిగ్రం థ అనే కొత్త మతాన్ని స్థాపించాడు. బీహార్ లోని సమ్మెద శిఖరం (ప్రస్తుతం మధుబన్ జార్ఖండ్) వద్ద మోక్షాన్ని పొందాడు.

జైనమత స్థాపకుడు మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడు. విశేషంగా కృషి చేసి, జైన మతాన్ని విస్తృతం చేయడంలో చరిత్రలో పార్శ్వనాథుడే ప్రథముడిగా నిలిచాడు. మ హోన్నత చరిత్ర కలిగిన పార్శ్వనాథుని విగ్ర హం వారసత్వ సంపదగా భద్రపరిచి, సంరక్షించాలి. తద్వారా భావితరాలకు చరిత్ర తెలు సుకునే అవకాశం ఉంటుంది అని కంకణాల రాజేశ్వర్ అన్నారు. సందర్శనలో చరిత్ర జిజ్ఞాసపరులు స్థానికుడు, తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా కోశాధికారి కర్నాల ధీరజ్ బాబు, భీంగల్ సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు, రాంగిరి ఆనంద్ పాల్గొన్నారు.