12 July, 2026 | 4:10 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీలో శివకృపానంద్ స్వామిజీ

05-04-2026 10:26 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: భారతదేశ ఆధ్యాత్మిక నాయకత్వానికి మరింత గుర్తింపును ఇస్తూ హిమాలయన్ సమర్పణ్ ధ్యానోగ్ వ్యవస్థాపకులైన  శివకృపానంద్ స్వామిజీని తమ ప్రతిష్టాత్మక ప్రపంచ ధ్యాన నిపుణుల కమిటీ సభ్యునిగా ప్రపంచ ధ్యాన ఫౌండేషన్ నియమించింది. ప్రపంచ మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును ప్రోత్సహించేందుకు ‘ప్రపంచ ధ్యాన ఫౌండేషన్’ చేపట్టిన ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’ను డిసెంబర్ 21 గా యునెస్కో ప్రకటించిన కొద్దికాలానికే ఈ గౌరవం దక్కింది.

స్వామీజీ దశాబ్దాల సేవను గుర్తించి, ప్రపంచ ధ్యాన దినోత్సవ కమిటీ మరియు జంగ్టో సొసైటీ  దక్షిణ కొరియాలోని సియోల్‌లో గల జంగ్టో సామాజిక, సాంస్కృతిక కేంద్రంలో రెండవ ప్రపంచ ధ్యాన దినోత్సవ సదస్సుకు ఆయనను ఒక విశిష్ట వక్తగా ఆహ్వానించారు. గుజరాత్‌లోని గాంధీనగర్ సమీపంలో ఉన్న మహూది గ్రామ రహదారి సమీపంలో నివసించే  స్వామీజీ, హిమాలయాలలో అనేక సంవత్సరాలు ఆధ్యాత్మిక సాధనలో గడిపి, అపారమైన జ్ఞానాన్ని పొందారు. 

ఈ సంవత్సరం జరిగిన ప్రపంచ ధ్యాన దినోత్సవ సదస్సు, ప్రపంచంలో పెరుగుతున్న మానసిక, భావోద్వేగ, పర్యావరణ సవాళ్లను పరిష్కరించడానికి ప్రముఖ ధ్యాన గురువులు, అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు, ప్రపంచవ్యాప్త సాధకులంతా కీలక ప్రసంగాలు చేశారు. ఫోరమ్ యొక్క లక్ష్యం తీర్చిదిద్దడంలో, ముఖ్యంగా 'వసుధైవ కుటుంబకం'అనే విశ్వ తత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో స్వామీజీ మార్గదర్శకత్వం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ప్రపంచ సామరస్యాన్ని పెంపొందించడంలో భారతదేశ నాయకత్వాన్ని శివకృపానంద్ నడిపించడంపై ధ్యాన నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.