ముఖ్యమంత్రిగా రేపు సువేందు ప్రమాణ స్వీకారం
ముఖ్యఅతిథులుగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
కోల్‌కతా, మే ౬: బంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో కొత్త బీజేపీ ప్రభు త్వం కొలువుదీరనుంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని పుర స్కరించుకుని శనివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుక అట్టహాసంగా జరుగనుంది. కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ హాజరుకానున్నారు. సుమారు 20 రాష్ట్రాల ముఖ్యమం త్రులు కూడా వేడుకలో పాలుపంచుకోనున్నారు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆదేశాల మేరకు అక్కడి యంత్రాంగం వేడుకలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. మరోవైపు, శుక్రవారం కోల్‌కతాలో బీజేపీ ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నది.
పార్టీ ఎమ్మెల్యేలు సువేందు అధికారిని శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్ను కోనున్నారు. పార్టీలో అసాధ్యడి (జెయింట్ కిల్లర్)గా పేరున్న సువేందు సుదీర్ఘ కాలం నుంచి పార్టీకి సేవలందిస్తూ వస్తున్నారు. గతేడాది కోల్‌కతా ఆర్జీకర్ ఆసు పత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యా చా రం చోటుచేసుకున్న ప్పుడు మమతా ప్ర భుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆ యన ముఖ్యపాత్ర పోషించారు. తృణ మూల్ పార్టీకి చెంది న మంత్రుల అవినీతి కుంభకోణాలను వెలికి తీసి ప్రజల ముందు పెట్టడంలోనూ కీలక పాత్రపోషించారు. చివ రకు తనకు ఒకప్పుడు గురుతుల్యురాలైన మమత బెనర్జీనే తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గంలో ఓడించి ఔరా అనిపించారు.






