30 August, 2026 | 3:40 AM

ఓటర్లలో సర్ గుబులు

30-08-2026 12:44 AM
  1. జిల్లాలో 14,07,349 మందికి నోటీసులు 
  2. బీఎల్‌ఓల వద్దకు పరుగులు 
  3. 11 రకాల డాక్యుమెంట్లతో తప్పని తిప్పలు 
  4. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఓటర్లు 

మేడ్చల్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ వల్ల బోగస్ ఓటర్ల తొలగింపు ఏమో కానీ ఉన్న ఓటర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఓటరు జాబితాలో పేరు కాపాడుకోవడానికి ఇన్ని తిప్పలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లాలో ముసాయిదా ఓటరు జాబితాను ఇటీవల ప్రకటించారు.

జిల్లాలోని ఐ దు నియోజకవర్గాలలో 1907564 ఓటర్లు గా ప్రకటించారు. ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు ఉందని సంతోషపడ్డారు. కానీ అసలు తిప్పలు ఇక్కడే మొదలైంది. జి ల్లాలో 1407349 మందికి నోటీసులు జారీ చేస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు మ్యా చింగ్ కాలేదని 11 రకాల డాక్యుమెంట్లలో ఏ దో ఒకటి తీసుకుని బి ఎల్ ఓ కలవాలని నో టీసు ఇస్తున్నారు. ఇటీవల కాలంలో అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు చూయించడం పరిపాటిగా మారింది.

బ్యాంకు ఎకౌంటు కావాలన్నా, గ్యాస్ కనెక్షన్ కావాలన్నా, దేనికైనా ఆధార్ కార్డు అడుగుతున్నారు. కానీ ఓ టరు జాబితాలో పేరు మ్యాచింగ్ కాకుంటే ఆధార్ కార్డు పనిచేయడం లేదు. ఆధార్ కా ర్డు, రేషన్ కార్డు కాకుండా ఇతర 11 రకాల డాక్యుమెంట్లు అడుగుతున్నారు. ఈ 11 ర కాల డాక్యుమెంట్లు ఓటర్లకు ఎప్పుడు అందుబాటులో ఉండేవి కావు. కొందరి వద్ద ఈ 11 రకాల గుర్తింపు కార్డులు ఉండవు. వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.

1987 కంటే ముందు బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ జారీ చేసిన కార్డులు కావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగ గుర్తింపు కార్డు లేదా పెన్షన్ ఆర్డర్, జనన పత్రం, కుల, ఆదాయ, రెసిడెన్షియల్ ధ్రువీకరణ పత్రాలు, పదవ తరగతి సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, అటవీ శాఖ జారీచేసిన యాజమాన్య హక్కు పత్రాలు, ప్రభుత్వం ఇచ్చిన భూమి పత్రాలు, పాస్పోర్ట్ తదితర డాక్యుమెంట్లు చూపించాలి. 2002 తర్వాత జన్మించిన వారైతే వారి తల్లిదండ్రు లు గుర్తింపు కార్డులు సమర్పించాలి. 

బీఎల్‌ఓల వద్దకు పరుగులు 

నోటీసులు అందుకున్న ఓటర్లు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. 11 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒకటి తీసుకురావాలని చెప్పడంతో వాటికోసం వెతుకు తున్నారు. కొందరికి అవి అందుబాటులో లే కపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నో టీసులను పట్టుకొని బి ఎల్ వో ల వద్దకు ప రుగులు తీస్తున్నారు. ఓటర్లు తప్పనిసరిగా రావాలని చెబుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. 

ఇంతమందికి నోటీసులా! 

మేడ్చల్ జిల్లాలో 1407349 మందికి నోటీసులు జారీ చేయడం పట్ల పలువురు వి స్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గతం లో 2979310 ఓటర్లు ఉండేవారు. సర్ ప్ర క్రియ ముగిసిన తర్వాత 1907564 మంది ఓటర్లతో ముసాయిదా జాబితా ప్రకటించా రు. తాజాగా మళ్లీ 1407349 మంది ఓటర్ల కు నోటీసులు జారీ చేయడం గమనార్హం. మేడ్చల్ నియోజకవర్గంలో 296596, మ ల్కాజ్గిరి నియోజకవర్గంలో 213148, కుతుబుల్లాపూర్ నియోజకవర్గంలో 373510, కూకట్పల్లి నియోజకవర్గంలో 256776, ఉప్పల్ నియోజకవర్గంలో 267319 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేశారు. 

ఇతర ప్రాంతాలలో నమోదైన వారి పరిస్థితిదారుణం 

తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అనేకమంది మేడ్చల్ జిల్లాలో ఉపాధి నిమిత్తం వచ్చి నివసిస్తున్నారు. వీరు ఇటీవల సర్ కార్యక్రమం లో సొంత గ్రామంలోనే ఓటు నమోదు చే యించుకున్నారు. దీంతో జిల్లాలో 10715 66 ఓట్లు తగ్గిపోయాయి. సొంత గ్రామాల లో వీరికి నోటీసులు అందడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాక్యుమెంట్లు పట్టు కొని సొంత గ్రామానికి వెళ్లాలంటే ఇబ్బంది అవుతుందని తెలంగాణకు చెందినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సొంత గ్రామానికి వెళ్లడానికి రవాణా ఖర్చులు కావాలని, అంతేగాక స్థానికంగా వృత్తికి ఆటంకం కలుగుతుందని అంటున్నారు. సొంత గ్రామంలో ఓటు వేయాలని ఉద్దేశంతో అక్కడ ఓటరు జాబితాలో నమోదు చేసుకున్నామని, కానీ ఇలా ఇబ్బందులు ఎదురవుతాయని ఊహించలేదని వాపోతున్నారు. నోటీసుల వల్ల ఓట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.