30 August, 2026 | 5:00 AM

గంజాయి చాక్లెట్ల దందా గుట్టురట్టు

30-08-2026 12:42 AM
  1. 5,298 ప్యాకెట్లు స్వాధీనం
  2. పాన్‌షాప్‌పై దాడి.. ఒకరు అరెస్ట్
  3. మేడ్చల్ జిల్లా తూంకుంటలో ఘటన

శామీర్ పేట్, ఆగస్టు 29 (విజయక్రాంతి): గంజాయి కలిపిన చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని శామీర్ పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన బైద్యనాథ్ తూము కుంట చంద్రరెడ్డి కాలనీలోని తన పాన్‌షాప్ నుంచి ఈ చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.సమాచారం అందుకున్న పోలీసులు పాన్‌షాప్‌పై దాడి చేసి పెద్ద ఎత్తున గంజాయి కలిపిన చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం 5,298 ప్యాకెట్లు పట్టుబడగా, వాటి బరువు సుమారు 25 కిలోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనలో బైద్నాథ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని భార్య పూజా కుమారి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఈ చాక్లెట్లు ఎక్కడి నుంచి తెప్పించారు?

ఎవరెవరికి విక్రయించారు? వీటి వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు ద ర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువతను లక్ష్యం గా చేసుకుని ఇలాంటి మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశంపైనా విచారణ కొనసాగుతోంది.