calender_icon.png 10 February, 2026 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా పాలన ప్రభుత్వానికి మద్దతు తెలపండి

10-02-2026 12:14:02 AM

హోరెత్తించిన కాంగ్రెస్ పార్టీ భారీ బైక్ ర్యాలీ

ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

భూత్పూర్, ఫిబ్రవరి 9 : మున్సిపాలిటీలో పదికి పది స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికల చివరి రోజు కావడంతో అమిస్తాపూర్ నుంచి గోప్లాపూర్ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అ న్నారు. అభివృద్ధికి అండగా ఉండాలని ప్రజానీకాన్ని కోరారు. గత పది ఏళ్ల బిఆర్‌ఎస్ పాలనలో భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని, భూత్పూర్ పట్టణంలో ఒక డబల్ బెడ్ రూమ్ ఇల్లు, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని గత ప్రభుత్వ తీరుపై, మాజీ ఎమ్మెల్యే వైఖరి పై తీవ్ర స్థాయిలో విరుచుక్క పడ్డారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే భూత్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి మున్సిపాలిటీలోని సమస్యలను గుర్తించి రోడ్లు, డ్రైనేజీలు వ్యవస్థను మెరుగుపరిచామని, రూ. 20 కోట్ల నిధులతో మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూ ర్ మున్సిపాలిటీలో అన్ని తం డాలకు వీటి రోడ్లు వేశామని నీ సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆయనపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు.

మీ అం దరి ఆశీస్సులతో మున్సిపాలిటీలోని పదికి పది స్థానాలు గెలుచుకొని భూత్పూర్ మున్సిపాలిటీ పై కాంగ్రెస్ జెం డాను ఎగరవేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కే సి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ డాక్టర్ కదిరి శేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మూడవత్ బాలకోటితోపాటు కాంగ్రె స్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.