10-02-2026 12:16:44 AM
అయిజ ఫిబ్రవరి 9: అయిజ మున్సిపల్ ఎన్నికలు ప్రచారం బేరి సోమవారం సాయంత్రంతో ముగిసినది. ఓట్లు వేసి దినం సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల వినూత్న ప్రచారాలు ఊపందుకుంటున్నాయని ప్రజల్లో చర్చ మొదలైంది. కొందరు చుక్క, ముక్క, రొక్కం పంచితే విజయం ఎవరో ఒకరిని వరిస్తుంది.
గతంలో ఓడిన ప్రస్తుతం పుర పోరులో ఉండిన వారికీ భయం పట్టుకుందని అనుకుంటున్నారు. కొందరు వినూత్నం గా రాజ్యాంగం లోని కొన్ని చట్టాలును తీసుకొని చిన్న పుస్తకముగా ముద్రించి దళిత వాడలో ఇంటింటికి పంచారని ప్రచారం జరుగుతుంది. ఇన్ని చేసిన గెలుపు వరిస్తుందో లేదో అని ఇంకొందరు ఇంకొక మెట్టు పైకెక్కి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్క ఓటర్ ని కాళ్లు పట్టుకొని ఓటు వేయమని అడుగుతున్నారని చర్చ జరుగుతుంది.
అంతు పట్టని ఓటర్ నాడి : - ప్రస్తుత ఓటర్లు తెలివిగా వ్యవహరిస్తున్నారని ఏ పార్టీవారు తినిపించిన తింటున్నారని ఏ పార్టీ వా రు తాపిన తాగుతున్నారని ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుని జేబులో పెట్టుకుంటున్నారని ఏ పార్టీ ప్రచారానికి పిలిచిన వెళ్లి ప్రచా రంచేసి కూలి తీసుకుంటున్నారని చివరికి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళ మనసులో ముద్రించుకొని ఓట్లు వేసి గెలిపించుకుంటున్నారని అనుకుంటున్నారు.
కానీ ఓడిన అ భ్యర్థి ఎంత ఖర్చుపెట్టిన విజయం దక్కక అ యోమయంలో పడిపోతున్నారని అభ్యర్థులకు గుబులు మొదలైంది అని అనుకుం టున్నారు. ఏ ఎన్నికల పోరులోనైనా గెలిచిన అభ్యర్థి అయినా ఓడిన అభ్యర్తులైనా సరే ఖర్చులు పెట్టుకోకపోతే ఓట్లు వేయరని ధనం వృధా చేసుకుంటున్నారని, ఒకవేళ ఖర్చు పెట్టి ఓడిన అభ్యర్థి పరిస్థితి ఏమిటని ? ప్రజల్లో చర్చ సాగుతుంది.
ఒకప్పుడు మనిషిని, మనిషి మనస్తత్వాన్ని గుర్తించి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఓట్లు వేయించుకునే వారని కానీ ప్రస్తుతం దిగజారిపోతున్న రాజకీయ విలువలకు అనుగుణంగా ప్రజలు తీర్పునిస్తున్నారని చర్చించుకుంటున్నారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లలో ఓడిన అభ్యర్థులు అనుమానించిన ప్రతి వ్యక్తి ని నువ్వు నాకు ఓటు వేయలేదంటూ నేను పెట్టిన ఖర్చు మొత్తం నాకు ఇవ్వాలంటూ ఇంట్లోని సామాన్లు ఎత్తుకెళ్లిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చెక్కర్లు కొట్టిన విషయం విధితమే.
ఓడిన అభ్యర్థులు ఇటువంటి ప్రతీకార చర్యకు పూనుకుంటే ఓటేసిన వాడిపైన ఓటు వేయని వాడి పైన గొడవలకు దిగే ఆస్కారం ఉందని, ఇకనైనా ఇటువంటి అనైతిక విలువలకు స్వస్తి పలికి మందు, విందుల ప్రలోభాలకు లొంగక నిజాయితీగా ఓటు వేసి సరైన వ్యక్తిని ఎన్నుకునే పద్ధతి వచ్చి సమాజంలో మార్పు వస్తుందేమోనని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
ఓట్లు వేసే సమయం సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఓటర్ నాడీ పసిగట్టలేక కంటిమీద కునుకు కరువు అయిందని ఎవరికి వారే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని అనుకుంటున్నారు. ఏది ఏమైనా పుర పోరులో గద్దె ఎవరిని వరిస్తుందో చూడాలి అని మదన పడుతున్న ప్రజలు.